Balakrishna – Shriya : ఆ సినిమాలో డూప్ లేకుండా కార్ స్టంట్ చేశా.. దెబ్బకు శ్రియ ఇంకెప్పుడు నా డ్రైవింగ్‌లో కార్ ఎక్కను అంది..
బాలయ్య కూడా తనకు కార్లు ఇష్టమని ఓ సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన పంచుకున్నారు.

Balakrishna shared a Fast Driving Memory with Shriya in Unstoppable Show
Balakrishna – Shriya : బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 నుంచి రెండో ఎపిసోడ్ నేడు రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కు లక్కీ భాస్కర్ టీమ్ తరపున దుల్కర్ సాల్మన్, వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ, మీనాక్షి చౌదరి వచ్చారు. అయితే దుల్కర్ కి కార్లు అంటే ఇష్టమని, కార్ రేసింగ్ చేస్తానని చెప్పడంతో బాలయ్య కూడా తనకు కార్లు ఇష్టమని ఓ సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన పంచుకున్నారు.
Also Read : Jai Hanuman Song : అప్పుడే ‘జై హనుమాన్’ ఫస్ట్ సాంగ్ కూడా వచ్చేసింది..
బాలకృష్ణ మాట్లాడుతూ.. పైసా వసూల్ సినిమాలో కార్ ఫాస్ట్ గా వచ్చి రౌండ్ గా తిరిగి ఆగే షాట్ డూప్ లేకుండా నేనే డైరెక్ట్ గా చేశాను. పూరి జగన్నాధ్ డూప్ తెప్పించినా కూడా నేనే చేశాను. అప్పుడు కార్ లో శ్రియ ఉంది. నీకేం భయం లేదు కదా అని అడిగాను డ్రైవింగ్ స్టార్ట్ అయ్యేముందు. పూరి యాక్షన్ చెప్పగానే ఫాస్ట్ గా కార్ తీసుకొచ్చి సర్రున తిప్పాను. దెబ్బకు శ్రియ బాబోయ్ నేను మళ్ళీ మీ డ్రైవింగ్ లో కార్ ఎక్కను అంది అంత భయపడింది అంటూ తెలిపారు.