Jai Hanuman Song : అప్పుడే ‘జై హనుమాన్’ ఫస్ట్ సాంగ్ కూడా వచ్చేసింది..
నిన్న జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా నేడు జై హనుమాన్ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసారు.

Rishab Shetty Prasanth Varma Jai Hanuman Theme Song Released
Jai Hanuman Song : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కూడా ప్రకటించారు. తాజాగా నిన్న జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని కూడా ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచారు.
దీంతో జై హనుమాన్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తుండటంతో ప్రశాంత్ వర్మ సినిమాలపై ఇప్పట్నుంచే అంచనాలు పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. నిన్న జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా నేడు జై హనుమాన్ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. మీరు కూడా జై హనుమాన్ ఫస్ట్ లుక్ థీమ్ సాంగ్ వినేయండి..
యుగయుగముల యోగవిధి దాశరథి.. అంటూ సాగే ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అప్పుడే సాంగ్ కూడా రిలీజ్ చేయడంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. హనుమాన్ లాగే గూస్ బంప్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.