Balakrishna : ఇండస్ట్రీలో రికార్డులు మొదలయింది మా కాంబినేషన్లో.. ఇండియన్ సినిమాలోనే ఈ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేదు..
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో షో మొదలయ్యే ముందు షోకి వచ్చిన ఫ్యాన్స్ తో కాసేపు బాలకృష్ణ ముచ్చటించారు.

Balakrishna Interesting Comments on B Gopal and Samarasimha Reddy Movie Records in AHA Unstoppable Show
Balakrishna : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలయిన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి కంచంద్రబాబు గెస్ట్ గా రాగా రెండో ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్ తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ వచ్చారు. లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు. తాజాగా నేడు దీపావళి కానుకగా అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ రిలీజ్ చేసారు.
అయితే ఈ ఎపిసోడ్ లో షో మొదలయ్యే ముందు షోకి వచ్చిన ఫ్యాన్స్ తో కాసేపు బాలకృష్ణ ముచ్చటించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు బాలయ్య. ఓ అభిమాని బి. గోపాల్ తో మీ అనుబంధం అని అడగ్గా బాలకృష్ణ ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : Rajinikanth : ఓటీటీలోకి వచ్చేస్తున్న వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆయన గోపాల్ అంటే కృష్ణుడు, నేను బాలకృష్ణుడు. మా మొదటి సినిమా లారీ డ్రైవర్. ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు.. ఇలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాము. అసలు ఇండస్ట్రీలో రికార్డులు మొదలయింది మా కాంబినేషన్లోనే. అప్పటివరకు రికార్డులు అంటూ లేవు. ఆ తర్వాత మళ్ళీ మేమే మా రికార్డులను బద్దలు కొట్టాము. చరిత్ర సృష్టించాలన్నా మేమే, తిరగరాయాలన్నా మేమే. అలంపురం జోగులాంబ ఆలయంలో సమరసింహా రెడ్డి క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు గోపాల్ వచ్చి టైటిల్ గురించి చెప్పారు. సమరసింహా రెడ్డి అన్నారు. నేను ఒప్పుకొనేనేమో అనుకున్నారు. కానీ అమ్మవారి ఆలయంలో చెప్పారు కాబట్టి అమ్మవారే చెప్పారు అని ఓకే అన్నాను. అది కూడా సంక్రాంతి సినిమానే. 105 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది ఆ సినిమా. ఇండియన్ సినిమాలో ఇలాంటి రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో బాలయ్య వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక సమరసింహా రెడ్డి సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే.