Rajinikanth : ఓటీటీలోకి వచ్చేస్తున్న వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rajinikanth : ఓటీటీలోకి వచ్చేస్తున్న వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vettayan movie is coming to OTT

Updated On : October 31, 2024 / 2:19 PM IST

Rajinikanth : రజినీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన వేట్టయన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ అక్టోబర్‌ 10న వచ్చిన ఈ సినిమా పోలీస్ యాక్షన్‌ డ్రామా నేపధ్యంలో తెరకెక్కింది. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రల్లో నటించారు.

థియేటర్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నవంబర్‌ 8 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చెయ్యనున్నారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..

వేట్టయన్ కథ విషయానికొస్తే.. అథియన్ గా రజనీకాంత్ ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఇందులో కనిపిస్తారు. అథియన్ కి నిజాయతీతో పాటు ధైర్యం కూడా ఎక్కువ. న్యాయం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం భయపడడు. అదే సమయంలో అధికారిని శరణ్య అనే ఓ స్కూల్ టీచర్ హత్య కలచివేస్తుంది. ఆ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వం, పోలీసు అధికారుపైన ఒత్తిడి ఎలా ఉంటుంది, ఈ కేసును రజినీకాంత్ రంగంలోకి దిగి ఎలా హ్యాండిల్ చేస్తాడు. అసలు ఈ హత్య ఎందుకు చేస్తారు. దీని వెనుక ఉన్నది ఎవరు అన్నది సినిమాలో చూపిస్తారు.