Pushpa 2 : పుష్ప 2 నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..

Romantic poster release from Pushpa 2 movie
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని టీమ్ ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Naga Chaitanya : నాగ చైతన్యతో జాన్వీ.. ఆ స్టార్ డైరెక్టర్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసారుగా..
అయితే నేడు దీపావళి సందర్బంగా పుష్ప 2 నుండి ఓ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. వంట గదిలో చక్కగా చీర కట్టుకొని ఉన్న రశ్మికను అల్లు అర్జున్ రొమాంటిక్ గా చూస్తూ కౌగిలించుకున్నాడు. రష్మిక, అల్లు అర్జున్ రొమాంటిక్ పోస్టర్ ను చూసి.. నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Pushpa Raj & Srivalli wish you and your family a very Happy Diwali 🫶#Pushpa2TheRule will bring celebrations and fireworks on the big screens 💥💥💥
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024 ❤🔥#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/DoxsjFF1fT
— Pushpa (@PushpaMovie) October 31, 2024
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనసూయ, ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.