Sai Dharam Tej : వాళ్ల మీద కేసు ఫైల్ చెయ్యాలి..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ స్పందించారు..

Sai Dharam Tej : వాళ్ల మీద కేసు ఫైల్ చెయ్యాలి..

Rp Patnaik

Updated On : September 11, 2021 / 4:29 PM IST

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాస్పిటల్‌కి వెళ్లి సాయి తేజ్‌ని పరామర్శించారు.

Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..

జానియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా పరిశ్రమకు చెందినవారు సుప్రీం హీరో త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రమాదం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ స్పందించారు.

‘రోడ్ మీద ఇసుక ఉండేలా కట్టినందుకు కన్‌స్ట్రక్షన్ కంపెనీ మీద.. రోడ్లు శుభ్రం చెయ్యని మున్సిపాలిటీ మీద పోలీసులు కేసు ఫైల్ చెయ్యాలి’ అన్నారు. ఆర్.పి. చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ మెగా ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత కొన్నాళ్లుగా దర్శకుడిగా సినిమాలు చేస్తున్న పట్నాయక్.. లాంగ్ గ్యాప్ తర్వాత తేజ డైరెక్ట్ చేస్తున్న సినిమాకి సంగీతమందిస్తున్నారు.