Thaman : 11 ఏళ్ళప్పుడు నాన్న చనిపోయారు.. 56 వేలు ఇన్స్యూరెన్స్ మనీ తప్ప ఏం లేదు.. అమ్మ ఆ డబ్బుల్ని.. తమన్ ఎమోషనల్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ తన తండ్రి మరణం గురించి, అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Music Director Thaman got Emotional while Remember his Father

Thaman : ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న తమన్ చిన్నతనంలో చాలా కష్టపడ్డాడు. తమన్ తండ్రి శివకుమార్ సినిమా ఇండస్ట్రీలోనే మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద డ్రమ్మర్ గా పనిచేసేవారు. చాలా సినిమాలకు ఆయన డ్రమ్మర్ గా పనిచేసారు. కానీ తక్కువ వయసులోనే తమన్ తండ్రి శివకుమార్ చనిపోయారు. శివ కుమార్ డ్రమ్మర్ కావడంతో చిన్నప్పట్నుంచి తమన్ కి కూడా అందులో శిక్షణ ఇచ్చి తమన్ ని కూడా డ్రమ్మర్ గా, రిథమ్ ప్లేయర్ గా తయారుచేసారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ తన తండ్రి మరణం గురించి, అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : Thaman – Pawan Kalyan : OG లో కొన్ని సీన్స్ చూసాను.. నా బ్లడ్ పరిగెత్తింది.. స్టూడియో మొత్తం పవన్ సర్ ఫోటోలు పెట్టుకొని..

తమన్ మాట్లాడుతూ.. నా 11 ఏళ్ళ వయసులో మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయినప్పుడు బాడీ దగ్గర మా అమ్మ, చెల్లి ఏడుస్తూనే ఉన్నారు. నేను అస్సలు ఏడవలేదు. సాయంత్రం శివమణి సర్ వచ్చాక ఆయన దగ్గర ఏడ్చాను. అప్పుడే అమ్మకు చెప్పాను. నేను చదవను ఇంక మ్యూజిక్ కి వెళ్లి పనిచేస్తాను అని. నాన్న చనిపోయాక 56 వేలు ఇన్స్యూరెన్స్ అమౌంట్ వచ్చింది. ఆ డబ్బులు తప్ప మా దగ్గర ఏం లేవు. నాకు 2వ తరగతి చదివే చెల్లి ఉంది. ఆమె కోసం దాయొచ్చు కానీ ఆ డబ్బులు మొత్తం నా మ్యూజిక్ పరికరాల కోసం ఇచ్చి నన్ను నమ్ముతున్నాను అని చెప్పింది మా అమ్మ. ఆ మాట నాకు బాగా గుర్తుంది. 11 ఏళ్ళ వయసు నుంచి నేను మ్యూజిక్ చేస్తున్నాను. శివమణి సర్ నన్ను గైడ్ చేశారు. నేను అమ్మ ఇచ్చిన డబ్బులతో మ్యూజిక్ పరికరాలు కొనుక్కున్నాను. మా నాన్న మంచితనం వల్ల నాకు అందరూ సపోర్ట్ చేశారు వర్క్ విషయంలో. నేను సంపాదించడం మొదలుపెట్టాక మా అమ్మకి కావాల్సిన ప్రతిదీ చూసుకున్నాను. ఆమె ఏం అడిగితే అది ఇస్తున్నాను. మా అమ్మని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాను. నా కోసం మా అమ్మ చాలా కష్టపడింది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.