Thaman – Pawan Kalyan : OG లో కొన్ని సీన్స్ చూసాను.. నా బ్లడ్ పరిగెత్తింది.. స్టూడియో మొత్తం పవన్ సర్ ఫోటోలు పెట్టుకొని..

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Thaman – Pawan Kalyan : OG లో కొన్ని సీన్స్ చూసాను.. నా బ్లడ్ పరిగెత్తింది.. స్టూడియో మొత్తం పవన్ సర్ ఫోటోలు పెట్టుకొని..

Music Director Thaman Interesting Comments on Pawan Kalyan OG Movie

Updated On : March 18, 2025 / 4:53 PM IST

Thaman – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. DVV నిర్మాణ సంస్థలో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఆతెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వట్లేదు. ఇంకో మూడు వారాలు డేట్స్ ఇస్తే OG సినిమా పూర్తవుతుంది.

OG సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. దీంతో తమన్ సినిమాకి ఇంకే రేంజ్ లో స్కోర్ ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Thaman – Rajasaab : ‘రాజాసాబ్’ అప్డేట్ ఇచ్చిన తమన్.. ప్రభాస్ చాలా రోజుల తర్వాత.. మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే..

తమన్ మాట్లాడుతూ.. OG సినిమా పూర్తిగా గ్యాంగ్ స్టర్ సినిమా. పవన్ కళ్యాణ్ గారు గన్ పట్టుకొని నిలబడితే నాకు ఇష్టం. నేను కూడా గన్ పట్టుకొని చాలా కాల్చేయాలి అనిపిస్తుంది. నేను సినిమాలో కొన్ని రషెష్ చూసాను. అప్పటికే నా బ్లడ్ పరిగెడుతుంది. ఎప్పుడు సినిమా నా దగ్గరికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా చేసేటప్పుడు నా స్టూడియో మొత్తం OG మోడ్ లోకి వెళ్ళిపోతుంది. నా స్టూడియో అంతా పవన్ కళ్యాణ్ గారి పవర్ ఫుల్ ఫోటోలు పెట్టుకుంటాను ఆ సమయంలో. ఆ సినిమాకు క్రేజీ మోడ్ లో పనిచేయాలి అనుకుంటున్నాను. టాలీవుడ్ లో చాలా రేర్ గా గ్యాంగ్ స్టర్ సినిమాలు వస్తాయి. OG కోసం నేను వెయిటింగ్ అని అన్నాడు.

Also Read : MAD Square Song : మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ రిలీజ్..

దీంతో తమన్ కామెంట్స్ తో పవన్ ఫ్యాన్స్ సినిమా బ్యాక్ గ్రౌండ్ పై మరింత హైప్ పెంచుకుంటున్నారు. కానీ పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=ePOglweqy7o