Thaman – Rajasaab : ‘రాజాసాబ్’ అప్డేట్ ఇచ్చిన తమన్.. ప్రభాస్ చాలా రోజుల తర్వాత.. మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే..
తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడాడు.

Music Director Thaman says Interesting things about Prabhas The Rajasaab Movie
Thaman – Rajasaab : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఓ పక్క స్టార్ హీరోల సినిమాలు, మరో పక్క అప్పుడప్పుడు టీవీ షోలు, క్రికెట్ తో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో వచ్చిన తమన్ త్వరలో రాజాసాబ్ సినిమాతో రానున్నాడు.
తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడాడు.
తమన్ మాట్లాడుతూ.. రాజాసాబ్ టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ప్రభాస్ సర్ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సాంగ్స్ తో వస్తున్నారు. సినిమాలో ఒక ఇంట్రో సాంగ్, ఒక మెలోడీ సాంగ్, ఒక లవ్ సాంగ్, సినిమా థీమ్ సాంగ్, ఐటెం సాంగ్, ముగ్గురు హీరోయిన్స్ తో డ్యాన్స్ సాంగ్, ఇంకో లవ్ సాంగ్ ఉన్నాయి. సాంగ్స్ ఇప్పుడు షూట్ చేస్తారు. కొన్ని పాటలు ఎప్పుడో డిజైన్ చేశాను. కానీ అవన్నీ పాతవి అనిపిస్తాయి. అందుకే అవన్నీ పక్కన పడేసి మళ్ళీ కొత్తగా పాటలు ట్యూన్ చేస్తున్నాం. కొన్ని ట్యూన్స్ ఇప్పుడు వర్క్ అవ్వవు అని డైరెక్టర్ కి చెప్పేసాను. ఫ్రెష్ గా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు రాజాసాబ్ పాటలు ఉంటాయి అని తెలిపాడు.
దీంతో రాజాసాబ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినా పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని తెలుస్తుంది. అలాగే సినిమాలో సినిమా థీమ్ సాంగ్ కాకుండా ఆరు పాటలు ఉన్నట్టు తెలుస్తుంది. తమన్ చెప్పినట్టు ప్రభాస్ అప్పుడెప్పుడో మిర్చి సినిమాలో డ్యాన్స్ వేసాడు. ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ సినిమాలో డ్యాన్స్ వేయనున్నారు అని అర్ధమవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Aditya 369 : బాలయ్య సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్.. ఎప్పుడంటే..
మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా హారర్ లవ్ రొమాంటిక్ జానర్లో తెరకెక్కుతుంది. ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించినా ఇంకా షూటింగ్ అవ్వకపోవడంతో వాయిదా పడింది.