First Love Song : తమన్ లాంచ్ చేసిన ‘ఫస్ట్ లవ్’ ప్రైవేట్ సాంగ్ విన్నారా? లవ్, బ్రేకప్ మెలోడీ సాంగ్..

వైశాలిరాజ్ నిర్మించిన 'ఫస్ట్ లవ్' సాంగ్ ని తాజగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంచ్ చేసాడు.

Music Director Thaman Launched Vaishali raj First Love Music Album

First Love Song – Thaman : ఇటీవల మంచి కాన్సెప్ట్స్ తో ప్రైవేట్ ఆల్బమ్స్ వస్తున్నాయి. చిన్న కథని ఒక సాంగ్ రూపంలో చక్కగా చూపిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్ రిలీజయింది. దీపు జాను, వైశాలిరాజ్ జంటగా బాలరాజు దర్శకత్వంలో మ్యాజికల్ ఆల్బమ్ గా ఫస్ట్ లవ్ తెరకెక్కింది. వైశాలిరాజ్ నిర్మించిన ఈ సాంగ్ ని తాజగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంచ్ చేసాడు.

ఈ ఫస్ట్ లవ్ సాంగ్ కి కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాయగా సంజీవ్ సంగీత దర్శకత్వంలో సింగర్ సిద్ శ్రీరాం పాడారు. ఒక చక్కని లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ చూపిస్తూ మెలోడీగా ఈ పాటని మంచి విజువల్స్ తో తెరకెక్కించారు. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని వినేయండి..

ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ఈ పాటలో ఒక అద్భుతమైన కథని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. విజువల్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. దీపు, వైశాలి జంట స్క్రీన్ పై చాలా బాగుంది. ఈ సాంగ్ చూస్తుంటే వైశాలి, ఖుషి లాంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఈ ఆల్బమ్ పెద్ద హిట్ అవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఇక ఈ పాటని నిర్మించి ఇందులో హీరోయిన్ గా నటించిన వైశాలి రాజ్ మాట్లాడుతూ.. బిజీగా ఉండి కూడా తమన్ సర్ వచ్చినందుకు థ్యాంక్యూ. ఈ పాటని ఎంతో ఇష్టపడి కష్టపడి చేసాము. సిద్ శ్రీరామ్ చాలా బాగా పాడారు. ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ పాట నచ్చితే అందరికి షేర్ చేయండి అని తెలిపింది.

హీరో దీపు జాను మాట్లాడుతూ.. తమన్ గారు ఈ ఆల్బమ్ సాంగ్ కి వచ్చి దీన్ని ఇంకా పెద్ద పాట చేసారు. ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది అని అన్నారు. డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ.. అందరూ ఈ ఆల్బమ్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీపు, వైశాలిరాజ్ అద్భుతంగా నటించారు. వైశాలిరాజ్ నిర్మాతగా కూడా మంచి ప్రొడక్షన్ ఇచ్చారు. సిద్ శ్రీరామ్ వోకల్స్ తో ఈ పాట మరో లెవెల్ కి వెళ్ళింది. ఈ పాట మీ అందరికి నచ్చుతుంది అని అన్నారు.