Pushpa 2 – Thaman : పుష్ప 2 కోసం తమన్ ఎందుకు.. ? సుకుమార్ మళ్ళీ ఏం మార్పులు చేస్తున్నాడు?

తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 టీమ్ లోకి తమన్ ని తీసుకున్నారట.

Music Director Thaman on Board to Allu Arjun Pushpa 2 Rumours goes Viral

Pushpa 2 – Thaman : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇంకా ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 టీమ్ లోకి తమన్ ని తీసుకున్నారట. పుష్ప 1కి ఆల్రెడీ దేవి మ్యూజిక్, సాంగ్స్ విషయంలో అదరగొట్టాడు. పుష్ప 2కు కూడా దేవి అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటివరకు రిలీజయిన కంటెంట్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మరి తమన్ ని ఎందుకు తీసుకున్నారు అని చర్చ జరుగుతుంది. అయితే తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవ్వడంలో దిట్ట అని తెలిసిందే. అందుకే పుష్ప 2 సినిమాలోని కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి తమన్ ని తీసుకున్నారట సుకుమార్.

Also Read : Raha Birthday : రాహా పుట్టినరోజు స్పెషల్.. ఆలియా ఎమోషనల్ పోస్ట్ వైరల్..

దీంతో ఈ విషయం వైరల్ అవుతుంది. మంచి బ్యాక్ గ్రౌండ్ కోసం తీసుకుంటే మంచిదే కదా అని ఫ్యాన్స్ భావిస్తుంటే కొంతమంది ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ ఇచ్చినా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది సుకుమార్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.