టాలీవుడ్‌లో ఏం నడుస్తుంది.. థమన్ హవా నడుస్తోంది!

‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో థమన్ హవా నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

  • Publish Date - November 14, 2019 / 11:26 AM IST

‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో థమన్ హవా నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏం నడుస్తుంది.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హవా నడుస్తోంది. ఇటీవల కాలంలో థమన్ కంపోజ్ చేసిన పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్ రాబడుతున్నాయి.. దీంతో మనోడి పేరు మార్మోగిపోతుంది.

‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం థమన్ కంపోజ్ చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ‘డిస్కో రాజా’ సినిమాలోని ‘నువ్వు నాతో ఏమన్నావో’ పాట కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఒకప్పుడు కాపీ క్యాట్ ఆరోపణలు చేసిన వాళ్లే.. ఇప్పుడు థమన్ సూపర్ అంటున్నారు..

‘అల వైకుంఠపురములో’ మిగతా పాటలు, అలాగే ‘డిస్కో రాజా’లో బ్యాలెన్స్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ పాటలతో తెలుగు సినీ పరిశ్రమలో థమన్ హవా నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో థమన్ పేరుతో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.