Na Manasu Ninnu Chera Lyrical Song from Nachinavadu released
Nachinavadu : ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘నా మనసు నిన్ను చేర’ అనే లవ్ మాస్ బీట్ పాటను, ప్రముఖ గాయకుడు యాజిన్ నిజార్ పాడగా, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో సోమవారం విడుదలయింది.
Project K : అమెరికాలో ల్యాండ్ అయిన ప్రభాస్ అండ్ రానా.. డార్లింగ్ సన్నబడ్డాడంటున్న ఫ్యాన్స్..
అనంతరం హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం, హాస్యానికి పెద్దపీట వేస్తూ, నేటి యూత్ కి కావాల్సిన ప్రతి అంశం ఇందులో పొందుపరిచామని,త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక పాండిచ్చేరి లోని వివిధ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించామని, సినిమా చాలా బాగా వచ్చిందనీ, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.