శశికుమార్ ‘నానోడిగల్ 2’ ట్రైలర్

సముద్రఖని దర్శకత్వంలో శశికుమార్, అంజలి, అతుల్య, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘నానోడిగల్ 2’ ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - January 25, 2020 / 08:56 AM IST

సముద్రఖని దర్శకత్వంలో శశికుమార్, అంజలి, అతుల్య, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘నానోడిగల్ 2’ ట్రైలర్ రిలీజ్..

2009లో తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం ‘నానోడిగల్’.. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో మరో ప్రముఖ నటుడు, దర్శకుడు శశికుమార్ నటించడం విశేషం. ఈ మూవీ ‘శంభో శివ శంభో’ పేరుతో సముద్రఖని దర్శకత్వంలోనే తెలుగులో రీమేక్ అయ్యింది.

పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. శశికుమార్, అంజలి, అతుల్య, భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. శనివారం  ‘నానోడిగల్ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. స్టూడెంట్స్, పాలిటిక్స్ వంటి అంశాలతో తెరకెక్కిన ‘నానోడిగల్ 2’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది.

Read Also : ఆ సీన్ స్ఫూర్తితో తీసిన సినిమా ‘వాళ్లిద్దరి మధ్య’

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. జ్ఞాన సంబంధం, తులసి, నమో నారాయణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రఫీ : ఎన్.కె.ఏకాంబరం, ఎడిటింగ్ : ఏల్.రమేష్, ఆర్ట్ : జాకీ, స్టంట్స్ : సిల్వ, కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్, జానీ, కలై కుమార్.