Naatu Naatu singers Kaala Bhairava, Rahul Sipligunj meet world's top singer Rihanna at Oscars
Naatu Naatu : ఒక తెలుగు పాటలోని హుషారు, కమ్మదనాన్ని ప్రపంచం మొత్తానికి రుచి చూపించిన పాట ‘నాటు నాటు’. భాషతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కర్ని ఊర్రుతలుగించింది. సాధారణ వ్యక్తులు నుంచి ప్రభుత్వ అధికారులు వరకు నాటు నాటుకి కాలు కదిపిలే చేసింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకొని ప్రపంచ విజేతగా నిలిచింది. కాగా ఆస్కార్ బరిలో నాటు నాటుతో పాటు వరల్డ్ లోని టాప్ మోస్ట్ సింగర్స్ అంతా పోటీ పడ్డారు. వారిలో ఒకరు అమెరికన్ సింగర్ రిహన్న.
RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని
రిహన్న తన కెరీర్ లో ఇప్పటి వరకు 230కు పైగా అవార్డులు అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టింది. ఇక ఈ ఏడాది వాకండా ఫర్ ఎవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మీ అప్’ పాటతో ఆస్కార్ బరిలో నిలిచింది. కానీ ఆస్కార్ ని నాటు నాటు గెలుచుకుంది. పోటీలో ఓడిపోయిన రిహన్న ఎటువంటి అసూయకు పోకుండా ఆస్కార్ గెలుచుకున్న RRR టీంని అభినందించింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగుంజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లు వేశారు.
RRR : RRR ఆస్కార్ పై బాలీవుడ్ సింగర్ ట్వీట్.. సిగ్గుగా ఉంది!
రాహుల్ సిప్లిగుంజ్.. నేను ఇవాళ చాలా గొప్ప మనుసున్న అద్భుతమైన మహిళను కలిశాను. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే ఆమె వినయాన్ని చూసి నేను ఇంకా షాక్‌లో ఉన్నాను. మమ్మల్ని పిలిచి, మమ్మల్ని పొగుడుతూ, ఆస్కార్ గెలిచినందుకు అభినందించినందుకు చాలా పెద్ద థాంక్యూ. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్.
కాలభైరవ.. రిహన్న కలవడం ఒక కలలా ఉంది. ఆమె కలిసిన సమయంలో నాకు అసలు మాటలు రాలేదు. ఆమెతో కలిసి మాట్లాడిన క్షణాలు వర్ణించడానికి నా దగ్గర అసలు మాటలు లేవు. ఈ జ్ఞాపకం నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది.