Mohan Babu: ‘మోహన్ బాబుపై ఆరోపణల్లో వాస్తవం లేదు’

తిరుపతిలోని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినీ నటుడు మంచు మోహాన్ బాబు ఓ నాయి బ్రాహ్మణుడికి అన్యాయం చేస్తుందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు.

Manchu Family

Mohan Babu: తిరుపతిలోని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినీ నటుడు మంచు మోహాన్ బాబు ఓ నాయి బ్రాహ్మణుడికి అన్యాయం చేస్తుందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు. అవన్నీ అవాస్తవాలే అని కొట్టి పారేస్తూ.. నాయి బ్రాహ్మణ కులస్థుల్ని మోహన్ బాబు అవమానించలేదని వివరించారు.

మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న మిక్కీ అనే మహిళ.. నాగ శీనుపై ఫిర్యాదు చేసింది. ఆమెకు సంబంధించిన హెయిర్ డ్రెస్సింగ్ వస్తువులను దొంగిలించారంటూ కేసు పెట్టింది. మిగిలినవన్నీ అసత్య ప్రచారాలే. నాగ శీను అనే వ్యక్తి మిక్కి అనే మహిళతో సహజీవనం సాగిస్తూ ఆమెను మోసం చేశాడంటూ మీడియా సమావేశంలో ఆ సంఘం స్పష్టం చేసింది.

నాగ శ్రీను మోహన్ బాబు వద్ద పదేళ్లుగా హెయిర్ డ్రెస్సర్ గాపని చేస్తున్నాడు. రూ.5 లక్షలు విలువ చేసే హెయిర్ డ్రస్సింగ్ సామాగ్రి చోరీ చేశాడని ఆరోపిస్తూ ఈనెల 17 మోహన్ బాబు అతని కుమారుడు విష్ణు కలిసి నాగ శ్రీనును చిత్ర హింసలు పెట్టినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు.

Read Also: ట్రోలర్లపై రూ.10కోట్ల పరువు నష్టం వేస్తానన్న మోహన్ బాబు

ఫిబ్రవరి నెలాఖరులో మీడియా ముందుకొచ్చిన నాగశీను.. తాను ఉద్యోగం మానేసినందుకు మోహన్ బాబు, విష్ణుకలిసి ఫిబ్రవరి 17న తనను చిత్ర హింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి కులం పేరుతో అవమానించారన్నాడు. విష్ణు తనపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారని…ఈ సంగతి తెలిసి తన తల్లిగుండెపోటుతో ఆస్పత్రిలో చేరిందని…నాలాంటి పేదవాడి జీవితంతో అడుకోవద్దని నాగ శ్రీను విజ్ఞప్తి చేసాడు.