Nabha Natesh : యాక్సిడెంట్ తర్వాత ‘స్వయంభు’ కోసం మారిన నభా నటేష్.. నభా వీడియో రిలీజ్..
నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో కూడా నభా నటేష్ నటిస్తుందని మూవీ యూనిట్ అధికారికంగా తెలిపారు.
- Saketh U
- Published On : April 4, 2024 / 10:35 AM IST
Nabha Natesh on Board in Nikhil Swayambhu Periodic Getup Video Released
Nabha Natesh : కన్నడ భామ నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయింది. కానీ తనకి యాక్సిడెంట్ అయి, ఆపరేషన్ అవ్వడంతో 2021 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే తనకు యాక్సిడెంట్ అయిన విషయం ఎవరికీ తెలియకుండా ఉంచి తను కొంచెం రికవర్ అయ్యాక ఈ విషయం చెప్పడంతో నభా అభిమానులు కంగారు పడ్డారు. కొన్ని నెలల క్రితమే నభా నటేష్ కోలుకొని సోషల్ మీడియాలో యాక్టివ్ అయి రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది.
ఇటీవలే నభా నటేష్ ప్రియదర్శితో ఓ సినిమా చేస్తుందని, ఆ సినిమా షూటింగ్ దశలో ఉందని సమాచారం వచ్చింది. తాజాగా నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో కూడా నభా నటేష్ నటిస్తుందని మూవీ యూనిట్ అధికారికంగా తెలిపారు. యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ సెట్ లోకి అడుగుపెడుతున్నట్టు, నభా నటేష్ పీరియాడిక్ గెటప్ లోకి మారి స్వయంభు సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోని రిలీజ్ చేస్తూ టీంలోకి స్వాగతం చెప్పారు.
మరి నభా నటేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. స్వయంభు(Swayambhu) సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. పీరియాడిక్ సినిమాగా స్వయంభు తెరకెక్కుతుంది. ఇందులో నభాతో పాటు సంయుక్త మీనన్ కూడా నటిస్తుంది.
