Kalki – Nag Ashwin : జపాన్ లో కల్కి రిలీజ్.. ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్.. ఫొటోలు, వీడియోలు చూశారా?

జపాన్ లో కల్కి సినిమా 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. నేటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ జపాన్ లో మొదలుపెట్టారు.

Nag Ashwin Participating in Kalki Promotions at Japan

Kalki – Nag Ashwin : ఇటీవల ప్రభాస్ కల్కి 2898AD సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా తెలుగు సినిమాలకు మరో మంచి మార్కెట్ అయిన జపాన్ లో రిలీజ్ కాబోతుంది.

జపాన్ లో కల్కి సినిమా 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. నేటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ జపాన్ లో మొదలుపెట్టారు.

జపాన్ లో కల్కి సినిమా ప్రమోషన్స్ కు ప్రభాస్ కూడా వెళ్ళాల్సింది కానీ ఓ సినిమా షూటింగ్ లో కాలికి గాయమవడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో కేవలం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కడే జపాన్ కి వెళ్లారు.

ఇక జపాన్ వాళ్ళు మన సినిమాల మీద, సినిమా హీరోలు, డైరెక్టర్స్ మీద ఎంత ప్రేమ చూపిస్తారో గతంలో ప్రభాస్, RRR సినిమాల సమయంలో చూసాం.

ఇప్పుడు కూడా నాగ్ అశ్విన్ జపాన్ కి వెళ్లడంతో అక్కడి సినిమా ప్రేమికులు ఆయనపై తమ ప్రేమను చూపిస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ అక్కడి మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అక్కడి ప్రీమియర్ షోలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు.

జపాన్ కి సంబంధించిన ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ ఫొటోలు, వీడియోలు కల్కి టీమ్ అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్ కి ప్రభాస్ కూడా వెళ్తే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.