Naga Chaitanya-Samantha: సామ్‌ను ఫాలో అవుతున్న చై.. ఎందుకంటే?
టాలీవుడ్ స్వీట్ కపుల్ సమంత-నాగచైతన్యల విడాకుల వార్త వినిపించి నెలరోజులు అవుతుంది. విడాకులకు ముందు ఎప్పుడూ చిల్ గా ఉంటూ.. సరదాగా కనిపించే సమంత మ్యారేజ్ బ్రేకప్ తర్వాత.. కొత్తగా..
- Naresh Mannam
- Published On : November 7, 2021 / 05:28 PM IST
Naga Chaitanya Samantha
Naga Chaitanya-Samantha: టాలీవుడ్ స్వీట్ కపుల్ సమంత-నాగచైతన్యల విడాకుల వార్త వినిపించి నెలరోజులు అవుతుంది. విడాకులకు ముందు ఎప్పుడూ చిల్ గా ఉంటూ.. సరదాగా కనిపించే సమంత మ్యారేజ్ బ్రేకప్ తర్వాత.. కొత్తగా కనిపిస్తోంది. ఎప్పుడూ కుక్కలతో ఆడుకుంటూ, ఫోటో షూట్స్ చేస్తూ.. షూటింగ్స్ తో బిజీగా ఉండే సమంత.. విడాకుల తరువాత తీర్దయాత్రలు చేస్తూ.. బరువైన కొటేషన్స్ పెడుతూ సీరియస్ గా మారిపోయింది.
Gangotri Kavya: వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందో చూశారా?
చైతూతో డైవర్స్ తర్వాత ఆ బాధ నుండి బయటపడేందుకు ఇటు ఆధ్యాత్మిక యాత్రలతో పాటు స్నేహితులతో విహార యాత్రలతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సామ్.. త్వరలోనే కెరీర్ లో మళ్ళీ బిజీ అయ్యేందుకు సిద్ధమైంది. ఇటు దక్షణాదితో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం స్పెషల్ కేర్ మొదలు పెట్టిన సామ్ ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చై కూడా అదే బాటలో డిజిటల్ ఎంట్రీకి సిద్దమయ్యాడు.
Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!
హర్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఓ వెబ్‌సిరీస్‌తో చై డిజిటల్ ఎంట్రీ సిద్దమవగా ఇందులో విలన్ రోల్ చేయనుండడం విశేషం. విక్రమ్‌కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో కూడా నెగటివ్ క్యారెక్టర్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చై కూడా డిజిటల్ లో ఎంట్రీ ఇవ్వడం అది కూడా నెగటివ్ రోల్ లో నటించడంతో సహజంగానే సామ్ తో కంపేరిజన్ మొదలైంది.
