Samantha : నాగచైతన్య పేరుని సమంత పూర్తిగా తొలిగించిందా..? వైరల్ అవుతున్న పిక్స్..!

సమంత నడుము మీద ఉండాల్సిన టాటూ ఇప్పుడు కనిపించడం లేదు. నాగచైతన్య పేరుతో ఉండే ఆ టాటూ..

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసిటిస్ చికిత్స కోసం విదేశాలు వెళ్ళింది. ట్రీట్మెంట్ సంగతి ఏమో గాని.. ప్రపంచ దేశాలు అన్ని తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ దుబాయ్ చేరుకుంది. ఇక అక్కడ నుంచి ఇటీవల కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ పిక్స్ లో సమంత చీర అందాలతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫొటోలో సమంత అందాలతో పాటు నెటిజెన్స్ మరొకటి కూడా గమనించారు. సమంత నడుము మీద ఉండాల్సిన టాటూ ఇప్పుడు కనిపించడం లేదు.

Also read : Ayalaan : శివకార్తికేయన్ అయలాన్ సినిమాలో ఏలియన్ గా నటించింది ఎవరో తెలుసా? మరుగుజ్జు నటుడు..

నాగచైతన్య పేరుతో ఉండే ఆ టాటూ కొత్తగా షేర్ చేసిన ఫొటోల్లో కనిపించడం లేదు. దీంతో నెటిజెన్స్ ఆ టాటూ ఏమైందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య పేరుని సమంత పూర్తిగా తొలిగించిందా..? లేదా సినిమాల్లో కవర్ చేసినట్లు ఈ ఫోటోషూట్ లో కూడా కవర్ చేసిందా..? అనే సందేహం నెలకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ ఫోటోలను ఒకసారి మీరు కూడా చూసేయండి.

కాగా సమంత దగ్గర ఉండాల్సిన పెంపుడు కుక్క ‘హాష్’ ప్రస్తుతం నాగచైతన్య దగ్గర కనిపిస్తుంది. చైతన్య తాజాగా కూడా ఆ హాష్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. మొన్నటి వరకు సామ్ దగ్గర ఉన్న హాష్ చైతన్య దగ్గర ఏం చేస్తుందని అభిమానుల్లో సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత మయోసిటిస్ చికిత్స కోసం విదేశాలు వెళ్లడంతో.. హాష్ ని చైతన్య దగ్గర వదిలి వెళ్లి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న సమయంలో హాష్.. చైతన్యకి బాగా అలవాటు అయ్యింది. అందుకనే సమంత హాష్ ని అక్కడ వదిలి వెళ్ళుంటుందని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు