Naga Chaitanya Sai Pallavi Special Valentines Day Wishes with Thandel Reel
Naga Chaitanya – Sai Pallavi : నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తండేల్(Thandel) షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో సాయి పల్లవి బాలీవుడ్ సినిమా షూటింగ్ కి వెళ్ళింది. సాయి పల్లవి జపాన్ లో ఓ బాలీవుడ్ సినిమా షూట్ లో ఉందని సమాచారం. అయితే నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా తండేల్ టీం సరికొత్త విషెష్ చెప్పారు.
ఇక్కడే హైదరాబాద్ లో ఉన్న నాగ చైతన్య, అక్కడ జపాన్ లో ఉన్న సాయి పల్లవి కలిసి ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ చేశారు. ఇటీవల రిలీజయిన తండేల్ సినిమా గ్లింప్స్ లో చైతన్య చెప్పే.. బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే.. అనే డైలాగ్ తో ఈ ఇద్దరూ కలిసి క్యూట్ గా రీల్ చేశారు. ఈ రీల్ తో తండేల్ టీం సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డే(Valentines Day) శుభాకాంక్షలు తెలిపింది.
దీంతో నాగచైతన్య, సాయి పల్లవి వాలెంటైన్స్ డే స్పెషల్ రీల్ వైరల్ గా మారింది. ఈ జంట క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నాగ చైతన్య, సాయి పల్లవి గతంలో ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమాతో మెప్పించి హిట్ కొట్టారు. ఇప్పుడు తండేల్ తో రాబోతున్నారు.