Naga Chaitanya Sai Pallavi Thandel Movie Digital Rights Sold to Netflix for Huge Amount
Thandel : నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో ఈ తండేల్ సినిమా భారీగా తెరకెక్కుతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథతో ఈ సినిమా రాబోతుంది.
తండేల్ సినిమాని చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆల్రెడీ తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. అయితే చైతన్య గత సినిమాలు ఆశించినంత ఫలితం సాధించలేదు. అయినా కథని నమ్మి ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెట్టారు. నాగచైతన్య మార్కెట్ ని మించి బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తుంది. థియేట్రికల్ గా తండేల్ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో తెలీదు కానీ డిజిటల్ బిజినెస్ మాత్రం అయిపోయింది.
తండేల్ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 40 కోట్లు పెట్టి భారీ ధరకు చేజిక్కించుకుంది సమాచారం. నాగచైతన్య మార్కెట్ కి ఒక సినిమా డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడుపోయాయంటే చాలా ఎక్కువ. నెట్ ఫ్లిక్స్ 40 కోట్లు పెట్టి ఈ సినిమా కొందంటే సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నట్టే. సినిమా థియేటర్స్ లో కూడా కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ యూనిట్ అంటున్నారు. డిజిటల్ 40 కోట్లు అయిందంటే ఇక థియేట్రికల్ ఎంతవుతుందో, ఏ రేంజ్ లో తండేల్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.