Naga Chaitanya, Samantha, Sobhita Dhulipala pic going viral on social media.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. స్టార్ బ్యూటీ శోభితను ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆలాగే స్టార్ బ్యూటీ సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంది. ఆమె డైరెక్టర్ రాజ్ తో కొంతకాలం నుంచి రిలేషన్ లో ఉండగా ఈమధ్యే వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే, తాజాగా నాగ చైతన్య భార్య శోభిత షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే, నాగ చైతన్య ఈ ఫొటోలో సమంత-శోభితతో ఉండటమే. అయితే, ఫోటో చూసిన వారు మాత్రం అక్కడ ఫొటోలో సమంత లేదు కదా అని అనుకుంటున్నారు.
కానీ, ఇక్కడ విశేషం ఏంటంటే.. శోభిత షేర్ చేసిన ఫొటోలో శోభిత-నాగ చైతన్య(Naga Chaitanya)తో మరో వ్యక్తి ఎవరో కాదు ఆమె శోభిత చెల్లి. ఆమె పేరు సమంత ధూళిపాళ. దాంతో, సమంత-శోభితతో నాగ చైతన్య అంటూ ఫోటో షేర్ చేసారు. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమంత అనేసరికి చాలా మంది హీరోయిన్ సమంత అనుకున్నారు అంతా. కానీ, ఆమె శోభిత చెల్లి సమంత అని తెలిసి అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, రీసెంట్ గా తండేల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.