Bigg Boss 9 Telugu: ఇక ఆడవాళ్లకి గుర్తింపు రాదా.. తనూజ ఓటమితో వెక్కి వెక్కి ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)లో తనూజ ఓడిపోవడం బాధించింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఒక లేడీ ఫ్యాన్.
A lady fan cried over Tanuja elimination in Bigg Boss 9.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. ఆర్మీ మ్యాన్, కామనర్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచాడు. లేడీ కంటెస్టెంట్ తనూజ రన్నరప్ గా నిలిచింది. కానీ, సీజన్ ముందు నుంచి తనూజ టైటిల్ ఫెవరేట్ గా బరిలోగి దిగింది. తన ఆటతో, మాటతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. అదే రేంజ్ లో ఆడియన్స్ కూడా ఆమెను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆమెకు దక్కుతున్న సపోర్ట్ చూసి తక్కకుండా ఈ సీజన్ లో లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతారని అనుకున్నారు అంతా. కానీ, ఏమయ్యిందో తెలియదు కళ్యాణ్ పడాల లిస్టులో టాప్ లోకి చేరుకున్నాడు.
గత కొన్ని వారాల నుంచి ఆయనకు ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ సపోర్ట్ వచ్చింది. దీంతో, సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ గా నిలిచాడు. అయితే, తనుజన్ రన్నరప్ కావడం పట్ల చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు. ఒక లేడీ ఫ్యాన్ అయితే ఏకంగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడుస్తూ ఒక వీడియో కూడా చేసింది. తనూజ ఓడిపోవడం బాధించింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘తనూజ విన్ అవనందుకు చాలా బాధగా ఉంది. బిగ్ బాస్ లో ఆడవాళ్లకు ఒక్కసారి కూడా సరైన గుర్తింపు దక్కదా. వంటింట్లోనే అలానే ఉండిపోవాలా. ఆడియన్స్ సీజన్ ముందు నుంచి అంత సపోర్ట్ చేశారు కదా. చివర్లో ఏమయ్యింది.
ఫైనల్ గా తనూజ విన్ అవలేదు. కళ్యాణ్ విన్నర్ అయినందుకు బాధలేదు. కానీ, ఒక లేడీ విన్నర్ అయితే చూడాలనుకున్నా. తనూజ విన్ అవనందుకు చాలా బాధగా ఉంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది ఆ లేడీ అభిమాని. దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చాలా మంది ఆమె వీడియోకి రియాక్ట్ అవుతూ.. మేము కూడా తనూజనే విన్ అవుతుంది అనుకున్నాం. కళ్యాణ్ అవడం షాక్ కి గురిచేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
