Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్.. ట్రోఫీతో ఎక్స్ కంటెస్టెంట్స్ సంబరాలు.. ఫోటోలు
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ పడాల చర్రిత సృష్టించాడు. సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. చివరి వరకు కల్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చిన నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలవడంతో స్టేజిపై నానా హంగామా చేశారు బిగ్ బాస్ సీజన్ 9 ఎక్స్ కంటెస్టెంట్స్. కళ్యాణ్ పడాలకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










