Thandel : మొదలైన ‘తండేల్’.. నాన్న, మామ ఆశీస్సులతో మొదలుపెట్టిన నాగ చైతన్య..

నాగచైతన్య(Naga Chaitanya).. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది.

Naga Chaitanya Thandel Movie Opening Pooja Ceremony Happened

Thandel Movie Opening : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya).. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుంది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం నాగ్ చైతన్య జిమ్ లో కసరత్తులు కూడా చేసి బాడీ పెంచాడు. ఇటీవల ఈ సినిమా టైటిల్ ‘తండేల్’ అని ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు.. చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కి వెంకటేష్, నాగార్జున ముఖ్య అతిథులుగా వచ్చారు. వెంకటేష్ క్లాప్ కొత్తగా నాగార్జున కెమెరా ఆన్ చేశారు. ప్రస్తుతం సినిమా ఓపెనింగ్ కార్యక్రమంకి చెందిన ఫోటోలు వైరల్ గా మారాయి.

 

Also Read : Naga Chaitanya : NC23 టైటిల్ ఏంటో తెలుసా? సరికొత్తగా ఉందే.. తన వాళ్ళ కోసం నిలబడిన నాయకుడు..

ఇక ఈ తండేల్ సినిమా.. 2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకోగా అందులో ఉన్న ఓ ఆంద్ర మత్స్యకారుడు కథ ఆధారంగా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నాగ్ చైతన్య సిక్స్ ప్యాక్ కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. లవ్ స్టోరీ తర్వాత చైతూతో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందని ప్రకటించిన తర్వాత సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.