Naga Chaitanya welcoming video to Manam Theatre Festival
Naga Chaitanya : యువసామ్రాట్ నాగ చైతన్య.. ప్రస్తుతం తన తదుపరి సినిమా NC23 కోసం తెగ కష్టపడుతున్నాడు. భారీగా కండలు, జుట్టు, గడ్డం పెంచేసి ఒక కొత్త లుక్ లోకి మారుతున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ హీరో తాజాగా తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ షేర్ చేశాడు. ఆ వీడియోలో నాగ చైతన్య ‘మనం థియేటర్ ఫెస్టివల్’ గురించి మాట్లాడాడు.
ఈ ఫెస్టివల్ లో రకరకాల భాషలకు సంబంధించిన కళాకారులు వచ్చి ప్రదర్శన చేయనున్నారు. యాక్టింగ్, డాన్స్, మ్యూజిక్.. ఇలా పలు కళలను ఈ ఫెస్టివల్ లో చూడవచ్చు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 17 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఇక ఈ ఫెస్టివల్ ప్రమోషన్స్ బాధ్యత నాగ చైతన్య తీసుకున్నాడు. ఈ ఫెస్టివల్ కి ఆహ్వానిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
Also read : Salaar : సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్‌కి టైం ఫిక్స్ అయ్యిందట.. ఎప్పుడో తెలుసా..?
అయితే ఈ ఫెస్టివల్ వీకెండ్స్ లోనే జరగనుంది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 17 వరకు మొత్తం నాలుగు వీకెండ్స్ లో మొత్తం 18 షోలు జరగనున్నాయి. ఈ ఫెస్టివల్ కి హైదరాబాద్ మొత్తం మీద నాలుగు థియేటర్స్ వేదిక కానున్నాయి. ఈ ఫెస్టివల్ కి సంబంధించిన టికెట్స్ ని బుక్ మై షోలో అందుబాటులోకి తీసుకు వచ్చారు. మరి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఉన్న ఆర్టిస్టులు అటెండ్ అయ్యే ఈ ఫెస్టివల్ కి మీరుకూడా వెళ్ళాలి అనుకుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.
ఇక నాగచైతన్య NC23 విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దర్శకుడు చందూ మొండేటి పక్కా ప్లానింగ్ తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారు. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో అల్లా అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నాడు.