Rangabali : నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ వచ్చేసింది.. కామెడీ అండ్ యాక్షన్‌తో అదిరిపోయింది!
నాగశౌర్య నటిస్తున్న కొత్త మూవీ రంగబలి టీజర్ రిలీజ్ అయ్యింది. కామెడీ అండ్ యాక్షన్‌తో టీజర్ అదిరిపోయింది.
- gum 95921
- Published On : June 8, 2023 / 04:34 PM IST
Naga Shaurya new movie Rangabali movie teaser released
Naga Shaurya Rangabali : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన సినిమా టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశాడు. గత ఏడాది ఉగాదిలో అనౌన్స్ చేసిన ఈ మూవీని నాగశౌర్య.. ఈ ఏడాది ఉగాదిన మూవీ టైటిల్ ని ప్రకటించి ప్రాజెక్ట్ నడుస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఈ మూవీ నుంచి ఒక మాస్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా నేడు టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ని కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ తో చాలా ఎంటర్‌టైనింగ్ గా కట్ చేశారు.
మెడికల్ షాప్ నడుపుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్, ఏ బాధ్యత లేకుండా జాలిగా తిరిగే కొడుకు మధ్య సన్నివేశాలు బాగా నవ్వించేలా ఉన్నాయి. అలాగే హీరో, అతని స్నేహితుడు మధ్య సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్య, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి పవన్ సంగీతం అందిస్తున్నాడు.
RGV Vyooham : వ్యూహం నుంచి మరో పిక్ షేర్ చేసిన వర్మ.. ఏ పాత్ర ఎవరో గుర్తు పట్టండి చూద్దాం!
నాని ‘దసరా’ సినిమాని తెరకెక్కించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. టీజర్ చూస్తుంటే మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. గతంలో శౌర్య నటించిన ఛలో సినిమా మాదిరి ఈ మూవీలో కూడా మాస్ అండ్ కామెడీ బ్యాలన్స్ గా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. నాగశౌర్య చివరి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. ఈ రంగబలి జులై 7న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
