Sharwanand – Varun Tej : శర్వా రిసెప్షన్.. వరుణ్ నిశ్చితార్ధం.. రేపు టాలీవుడ్ స్టార్స్ అంతా షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వబోతున్నారా..?
రేపు శర్వానంద్ రిసెప్షన్ కబురు చెబుతుంటే, వరుణ్ నిశ్చితార్ధం కబురు చెబుతున్నాడు. మరి ఇద్దరి ఫంక్షన్స్ తో టాలీవుడ్ రేపు బ్రేక్ తీసుకోబోతుందా?

Sharwanand wedding reception and Varun Tej Engagement tomorrow
Sharwanand – Varun Tej : టాలీవుడ్ లో పెళ్లి సందడి కనిపిస్తుంది. ఇటీవలే యంగ్ హీరో శర్వానంద్.. రక్షిత రెడ్డి అనే అమ్మాయితో జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ (Ram Charan), సిద్దార్థ్ (Siddharth), అదితిరావు హైదరితో (Aditi Rao Hydari) పాటు మరికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అయితే టాలీవుడ్ లోని స్టార్స్ అందరికి శర్వా హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రిసెప్షన్ రేపు (జూన్ 9) సాయంత్రం ఎన్ కన్వెన్షన్ హాల్ లో జరగబోతుంది.
Megha Akash: పీకల్లోతు ప్రేమలో మేఘా ఆకాశ్.. త్వరలోనే పెళ్లి..? వరుడు అతడేనంట..?
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్ధం కూడా రేపే జరగబోతుందని ఈరోజు ఉదయం మెగా టీం నుంచి క్లారిటీ వచ్చింది. వరుణ్ తేజ్ గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో (Lavanya Tripathi) ప్రేమలో ఉన్నదంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలోని ఫంక్షన్స్ కి లావణ్య హాజరయ్యి సందడి చేసేదని కూడా ఇండస్ట్రీలో వినిపించేవి. ఇక గత కొన్ని రోజులుగా వీరిద్దరూ జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.

Sharwanand wedding reception and Varun Tej Engagement tomorrow
ఈరోజు ఉదయం మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యంగా ఉండే ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి ఎంగేజ్మెంట్ వార్తని అభిమానులకు తెలియజేశాడు. రేపు వరుణ్ అండ్ లావణ్య నిశ్చితార్ధం జరగబోతుంది. అయితే ఎక్కడ, ఏ సమయానికి అనేది తెలియజేయలేదు. ఉదయం సమయంలోనే వరుణ్ నిశ్చితార్ధం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక శర్వా రిసెప్షన్ రేపు సాయంత్రం జరగనుంది. ఒకే రోజు ఇద్దరి హీరోల ఫంక్షన్స్ ఉండడంతో రేపు టాలీవుడ్ స్టార్స్ అంతా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి ఈ ఫంక్షన్స్ కి అటెండ్ అవుతారా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Sharwanand wedding reception and Varun Tej Engagement tomorrow