Megha Akash: పీక‌ల్లోతు ప్రేమ‌లో మేఘా ఆకాశ్‌.. త్వ‌ర‌లోనే పెళ్లి..? వ‌రుడు అత‌డేనంట‌..?

మేఘా ఆకాశ్.. తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. నితిన్(Nithiin) హీరోగా న‌టించిన లై చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది

Megha Akash: పీక‌ల్లోతు ప్రేమ‌లో మేఘా ఆకాశ్‌.. త్వ‌ర‌లోనే పెళ్లి..? వ‌రుడు అత‌డేనంట‌..?

Megha Akash

Actress Megha Akash: మేఘా ఆకాశ్.. తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. నితిన్(Nithiin) హీరోగా న‌టించిన ‘లై’ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది చెన్నై సుంద‌రి. సినిమా ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది అమ్మ‌డు. అయితే.. ఈ న‌టి త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నుంద‌ట‌. ఓ రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడుతో మేఘా పీక‌ల్లోతు ప్రేమ‌లో ముగినితేలుతుంద‌ట‌. ఇటీవ‌లే వీరిద్ద‌రు త‌మ కుటుంబాల‌కు ఈ విష‌యాన్ని చెప్ప‌గా పెళ్లికి ఇరు కుటుంబాల వాళ్లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. దీంతో డేటింగ్‌లో ఉన్న వీళ్లు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నార‌నే వార్త‌లు ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కన్‌ఫార్మ్.. మెగా టీం అఫిషియల్ నోట్!

కాగా.. ఆమె ప్రేమిస్తున్న వ్య‌క్తి చెన్నైకి చెందిన వాడా..? లేదా హైదరాబాద్‌కు చెందిన వ్య‌క్తా..? అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. అయితే అతను చెన్నైకి చెందినవాడేన‌ని ఆ వార్త‌ల సారాంశం. త్వ‌ర‌లోనే ఎంగేజ్‌మెంట్ డేట్‌, పెళ్లి తేదీల‌ను ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే.. ఈ వార్త‌ల‌పై ఇంత వ‌ర‌కు అటు 27 ఏళ్ల మేఘా ఆకాశ్ గానీ, ఇటు ఆమె కుటుంబ స‌భ్యులు గానీ స్పందించ‌లేదు.

26 అక్టోబ‌ర్ 1995లో చెన్నైలో జ‌న్మించింది మేఘా ఆకాశ్‌. ఉమెన్స్ క్రిస్టియ‌న్ కాలేజీలో విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్‌లో బీఎస్సీ చ‌దివింది. తెలుగు, త‌మిళ బాష‌ల్లో క‌లిపి రెండు డ‌జ‌నుకు పైగా సినిమాల్లో న‌టించింది. 2017లో ‘లై’ చిత్రంతో అరంగ్రేటం చేసింది. ఆ త‌రువాత ‘ఛల్ మోహన్ రంగ’, ‘పెట్టా’, ‘వంత రాజవతాన్ వరువేన్’, ‘బూమరాంగ్’, ‘ఎనై నోకి పాయుమ్ తోట’, ‘ఒరు పక్క కథై’, ‘కుట్టి స్టోరీ’, ‘రాధే’, ‘రాజా రాజ చోర’, ‘డియర్ మేఘా’, ‘గుర్తుందా సీతాకాలం’, ‘ప్రేమదేశం’ వంటి చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం మేఘా ఆకాశ్ తెలుగులో ‘మ‌ను చ‌రిత్ర’ సినిమాలో న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Adipurush : ఓం రౌత్, కృతి ముద్దు వ్యవహారం.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం..