Adipurush : ఓం రౌత్, కృతి ముద్దు వ్యవహారం.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం..

శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో ఓం రౌత్ హీరోయిన్ కృతి సనన్ ని ముద్దు పెట్టడం పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Adipurush : ఓం రౌత్, కృతి ముద్దు వ్యవహారం.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం..

chilkur balaji temple chief priest fires on om raut and kriti sanon kiss issue

Updated On : June 8, 2023 / 11:09 AM IST

Adipurush : రామాయణం కథాంశంతో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపిస్తూ చేసిన సినిమా ఆదిపురుష్. దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఇక రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ.. ఇటీవల తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి అందరికి తెలిసిందే. అనంతరం దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో ఓం రౌత్ చేసిన ఒక పని ఇప్పుడు వివాదంగా మారుతుంది.

Adipurush : ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ని ఫ్రీగా ఇస్తున్నారు.. కానీ వాళ్ళకి మాత్రమే!

దర్శనం అనంతరం కృతి సనన్ వెళ్లిపోతున్నా సమయంలో ఓం రౌత్ ని కౌగిలించుకోవడం, ఓం రౌత్ ఆమెకు ముద్దు ఇవ్వడం పై భక్తులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ విషయం పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి శేష వస్త్రాలు ధరించి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు చేయడం తన మనసుకి ఆందోళన కలిగించిందన్న రంగరాజన్.. తిరుమల కొండ పై అటువంటి వికారమైన చేష్టలు చేయకూడదని, అది శాస్త్ర సమ్మతం కాదని చెప్పుకొచ్చారు. తిరుమల కొండకు వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు సైతం వారి ఆలోచనా విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించిన రంగరాజన్.. ఓం రౌత్ చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టారు.

Adipurush : ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు.. స్పందించిన మూవీ టీం!

కాగా ఈ వివాదం కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. మరి దీని పై మూవీ టీం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. జూన్ 16న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాని.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాధ శరణాలయాలు, వృధాశ్రమాల్లో ఉండే వారికీ కార్తికేయ 2 (Karthikeya 2) నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఫ్రీగా చూపించబోతున్నారు.