Nagababu Niharika : అప్పుడు నాగబాబు ఇప్పుడు నిహారిక.. సరికొత్త రికార్డ్ సృష్టించిన తండ్రీకూతుళ్ళు..
నాగబాబు, నిహారిక టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. (Nagababu Niharika)
- Saketh U
- Published on- July 19, 2026 / 03:45 PM IST
Nagababu Niharika
Nagababu Niharika : నాగబాబు, నిహారిక టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. శనివారం నాడు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా దక్కించుకుంది. అంతే కాకుండా ఇదే సినిమాకు బెస్ట్ మేకప్ అవార్డు కూడా వరించింది. దీంతో కమిటీ కుర్రాళ్ళు టీమ్ కి, నిహారిక కొణిదెలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
నిహారిక నిర్మాతగా ఈ అవార్డు సాధించింది. అయితే గతంలో నాగబాబు కూడా తను నిర్మించిన సినిమాకు నేషనల్ అవార్డు సాధించాడు. నాగబాబు నిర్మాతగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన రుద్రవీణ సినిమా 1988లో రిలీజ్ అయింది. ఈ సినిమా నేషనల్ ఇంటిగ్రేషన్ విభాగంలో బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డు దక్కించుకుంది. అంతే కాకుండా బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డులు కూడా ఈ సినిమాకు వచ్చాయి.
Also Read : Sudheer Babu : మహేష్ మేనల్లుడు పసుపు ఫంక్షన్.. హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ సందడి.. ఫొటోలు చూశారా..?
38 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా నేషనల్ అవార్డు సాధించడం ఆసక్తికర విషయం. అలా నిర్మాతలుగా తమ సినిమాలతో నేషనల్ అవార్డులు సాధించిన తండ్రీకూతుళ్లుగా సరికొత్త రికార్డ్ సృష్టించారు నాగబాబు, నిహారిక.
