Nagababu : మీరే నా బలం.. నా జీవితం.. మెగాబ్రదర్ నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన పుట్టినరోజు వేడుకలను ఇద్దరు తమ్ముళ్లు, కుటుంబ సభ్యులతో అదే రోజున రాఖీ పౌర్ణమి కావడంతో మెగా ఇంట రెండు పండుగలతో సందడిగా మారింది.

Nagababu Shares Emotional Comments About His Mega Brothers

Nagababu Shares Emotional Comments : మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన పుట్టినరోజు వేడుకలను ఇద్దరు తమ్ముళ్లు, కుటుంబ సభ్యులతో అదే రోజున రాఖీ పౌర్ణమి కావడంతో మెగా ఇంట రెండు పండుగలతో సందడిగా మారింది. చిరు బర్త్ డే సెలబ్రేషన్లపై అభిమానులు కూడా సోషల్ మీడియాలో సందడి చేశారు. మెగా ఇంట జరిగే ఫంక్షన్లలో ఎప్పుడూ దూరంగా ఉండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈసారి హాజరుకావడంతో మెగా అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా బ్రదర్స్ ఒకేచోట కలిసి పండుగ జరుపుకోవడంతో అభిమానుల్లో ఆనందానికి హద్దుల్లేవు.

ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వేడుకలకు పవన్ కల్యాణ్, నాగబాబు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ అందరూ చిరు ఇంటికి రావడంతో సందడిగా మారింది. మెగా ఇంట్లో సందడికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఎమోషనల్ పోస్టు చేశారు. తన ఇన్ స్టాలో ఒక మెగా బ్రదర్స్ తో దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. ఆ ఫొటోలో పెద్దన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ తో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపించారు. నా బలం.. నా జీవితం మీరు ఇద్దరే అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

నా ప్రతి మైలులో మరిన్ని చిరునవ్వులు నింపడానికి.. ప్రతి క్షణంలో మ్యాజిక్ సజీవంగా ఉండటానికి నా బ్రదర్స్ @Chiranjeevikonidela #Pawankalyan అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. మెగా ఆడపడుచులు కూడా మెగా బ్రదర్స్ కు రాఖీ కట్టి ఆశ్వీర్వాదాలను అందుకున్నారు.

ఇక కుటుంబ సభ్యుల మధ్య మెగాస్టార్ చిరు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మెగా యువ హీరోల్లో రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌లు, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు అరవింద్‌, ఆయన భార్య, చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజతో పాటు నాగబాబు కుమార్తె నిహారిక, ఆమె భర్త కూడా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీలో ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకల్లో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ కనిపించలేదు. దాంతో అల్లూ అభిమానుల్లో నిరాశను కలిగించింది.