×
Ad

Nag 99 : నాగ్ 99.. నా సామిరంగ.. మళ్ళీ సంక్రాంతి బరిలో కింగ్..

నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగ్ 99వ సినిమాని ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నాగార్జున 99వ సినిమాని నిర్మిస్తున్నారు.

  • Published On : August 29, 2023 / 10:36 AM IST

Nagarjuna 99 Movie Naa Saami Ranga announced and Glimpse Released on Nagarjuna Birthday Movie Releasing on Sankranthi

Nagarjuna 99 Movie : టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున పుట్టినరోజు నేడు. 64 ఏళ్ళు వచ్చినా ఇంకా అంతే అందంగా, ఆరోగ్యంగా ఉంటూ, బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగ్. ఇప్పటికే 98 సినిమాలతో మెప్పించిన నాగ్ వందకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. నాగార్జున గత సంవత్సరం ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అప్పట్నుంచి నాగ్ తన నెక్స్ట్ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగ్ 99వ సినిమాని ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నాగార్జున 99వ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగ్ తన కెరీర్ లో ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ని ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు. విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకుడు నాగార్జున 99వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Koratala Siva : అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా ప్లాన్ చేస్తున్నాడా?

తాజాగా నేడు ‘నా సామిరంగ’ అనే సరికొత్త సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. గ్లింప్స్ లో నాగార్జున ని లుంగీ కట్టించి, బీడీ కాలుస్తూ మాస్ రోల్ లో చూపించారు. ఈ పండక్కి నా సామిరంగ అంటూ నాగార్జున అదరగొట్టారు. ఇన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేకుండా నేడు డైరెక్ట్ గా వచ్చి సంక్రాంతి బరిలో దిగాడు నాగ్. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.