Nagarjuna Akkineni Allari Naresh Naa Saami Ranga title song release
Naa Saami Ranga : నాగార్జున ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటిస్తున్నారు. మలయాళ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ‘నా సామిరంగ’ని విడుదల చేశారు. ఆస్కార్ విన్నర్స్ ఎం ఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాటకి సంగీతం, లిరిక్స్ అందించారు. అలాగే ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన తెలుగు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. పాటని పాడారు. మరి ఆ పాట వైపు ఓ లుక్ వేసేయండి.
Also read : Sivaji : బిగ్‌బాస్‌లో శివాజీ పర్ఫార్మెన్స్ చూసి మెగాస్టార్ ఏమన్నారంటే..? బయటపెట్టిన శివాజీ..