Nagarjuna: “ఏఎన్నార్” 99వ జయంతి.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్!

అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగునాట అగ్ర కథానాయకుడిగా, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన నటుడు. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో అక్కినేని నాగేశ్వర రావు గారు సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారమైన "దాదా సాహెబ్ పాల్కే" అవార్డుతో పాటు భారతదేశపు అత్యుత్తమ పురస్కారాలైన "పద్మశ్రీ", "పద్మ భూషణ్", "పద్మ విభూషణ్" అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇంతటి మహానటుడి 99వ జన్మదినం ఈరోజు కావడంతో...

Nagarjuna Emotional Tweet On ANR's 99th Birthday

Nagarjuna: అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగునాట అగ్ర కథానాయకుడిగా, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన నటుడు. 1924 సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ లోని రామాపురం అనే గ్రామంలో జన్మించిన ఈయన వెండితెరపై కాళిదాసుగా, దేవదాసుగా, రామదాసుగా చెరగని ముద్ర వేశారు. 1941లో ‘ధర్మపత్ని’ సినిమాతో నటజీవితాన్ని ప్రారంభించిన ఏఎన్నార్.. 1944లో తన రెండో సినిమాగా ‘శ్రీసీతారామ జననం’లో శ్రీరాముడి పాత్రను పోషించి హీరోగా మారారు.

Nagarjuna : రాజమౌళితో నాగార్జున సినిమా.. నాగార్జున ఏమన్నాడంటే..?

ఏడు దశాబ్దాల సినీ జీవితంలో అక్కినేని నాగేశ్వర రావు గారు సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారమైన “దాదా సాహెబ్ పాల్కే” అవార్డుతో పాటు భారతదేశపు అత్యుత్తమ పురస్కారాలైన “పద్మశ్రీ”, “పద్మ భూషణ్”, “పద్మ విభూషణ్” అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇంతటి మహానటుడి 99వ జన్మదినం ఈరోజు కావడంతో.. ఆయన కుమారుడు నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆయన స్మరించుకున్నాడు.

నాగార్జున ట్విట్టర్ ద్వారా.. “ఆశా జీవితాన్ని వదిలి ఆశయం వైపు వెళ్ళే వారిలో నేను ఎల్లప్పుడు జీవించే ఉంటానని చెప్పేవారు నాన్న. ఆ దారిలోనే వెళుతున్న నేను కూడా. ఆయనపై ప్రేమ, గౌరవం ఏనాటికి అలానే ఉంటాయి. జన్మదిన శుభాకాంక్షలు నాన్న” అంటూ ఏఎన్నార్ గారిపై నాగార్జున ప్రేమను వెల్లడించాడు.