Nagarjuna : చిరంజీవి డ్యాన్స్, గ్రేస్ చూసి భయపడ్డాను.. ఆ సినిమా చూసి మా మాస్ హీరో ఈజ్ బ్యాక్ అనుకున్నాను..

నాగార్జున, చిరంజీవి ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఈ ఈవెంట్లో నాగార్జున చిరంజీవి గురించి మాట్లాడుతూ..

Nagarjuna Interesting Comments on Megastar Chiranjeevi and Amitabh Bachchan in ANR National Award Event

Nagarjuna : నిన్న ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో ఏఎన్నార్ నేషనల్ అవార్డుని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ కార్యక్రమానికి అమితాబ్, చిరంజీవి, నాగార్జున, అక్కినేని ఫ్యామితో పాటు అనేకమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చాలామంది గత అనుభవాలను పంచుకున్నారు.

నాగార్జున, చిరంజీవి ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఈ ఈవెంట్లో నాగార్జున చిరంజీవి గురించి మాట్లాడుతూ.. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవితో నాకు ఎన్నో బ్యూటిఫుల్ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన సినిమాలు, ఆయన గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన ఈ మధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు. నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు నాన్నగారు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డ్యాన్స్ ని చూడమని చెప్పారు. అప్పుడు చిరంజీవి, రాధ గారి మధ్య ఓ రెయిన్ సాంగ్ షూట్ జరుగుతుంది. అప్పుడు చిరంజీవి గారి డాన్స్, గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పుట్టింది. ఆయన లాగా డ్యాన్స్ చేయగలనా అనిపించింది. అందుకే డ్యాన్స్ కాకుండా మనం వేరే దారిలో వెళ్దాం అని ఫిక్స్ అయ్యాను. సినిమా జర్నీతో పాటు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ టైంలో ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. నాన్నగారు మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేవాళ్ళు. చిరంజీవి గారు అది చేసి చూపించారు. అమితాబచ్చన్ గారు ఏఎన్ఆర్ అవార్డుని చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది అని అన్నారు.

Also Read : Chiranjeevi : అప్పుడు అమితాబ్ నా గురించి.. కింగ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా అని..

అలాగే అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ గారు ఏఎన్నార్ అవార్డుని అందుకోవడంతో ఈ అవార్డు ప్రతిష్ట మరింత పెరిగింది. ఇవాళ చిరంజీవి గారికి ఈ అవార్డు ఇవ్వడానికి అమితాబచ్చన్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రీసెంట్ గా కల్కి సినిమా చూశాను. అమితాబచ్చన్ గారిని అశ్వద్ధామ పాత్రలో చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకి కాల్ చేసి చెప్పాను అని అన్నారు.