Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతొచ్చాయో తెలుసా?

నా సామిరంగ సినిమాకి హిట్ టాక్ టాక్ రావడంతో పండక్కి ఫ్యామిలీలు నాగ్ సినిమాకు వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.

Nagarjuna Naa Saami Ranga Movie First Day Collections Details

Naa Saami Ranga Collections : విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ నిన్న జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేయగా.. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి.

ఇక నా సామిరంగ నిన్న మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివెంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలా నా సామిరంగని తెరకెక్కించారు. ఈ పండక్కి మంచి ఎంటర్టైనింగ్ సినిమా వచ్చిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ టాక్ రావడంతో పండక్కి ఫ్యామిలీలు నాగ్ సినిమాకు వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.

Also Read : Shatamanam Bhavati : ‘శతమానం భవతి’ సీక్వెల్ అనౌన్స్.. వచ్చే సంక్రాంతికి బరిలో..

నా సామిరంగ సినిమా మొదటి రోజు 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా మూడు సినిమాలు ఉన్నా ఈ కలెక్షన్స్ వచ్చాయి. లేదంటే ఇంకా ఎక్కువే వచ్చేవని తెలుస్తుంది. ఇక హాలిడేస్ 18 వరకు ఉండటంతో కలెక్షన్స్ 30 కోట్ల వరకు రావొచ్చు అని తెలుస్తుంది.