Naa Saami Ranga : అదరగొడుతున్న కింగ్.. నా సామిరంగ మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘నా సామిరంగ’ జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి విజయం సాధించింది ఈ సినిమా.

Nagarjuna Naa Saami Ranga Movie Three Days Collections Full Details Here

Naa Saami Ranga : నాగార్జున సంక్రాంతికి సినిమాతో వస్తే అది హిట్ అయినట్టే. ఈ సంక్రాంతికి కూడా నాగార్జున నా సామిరంగ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘నా సామిరంగ’ జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి విజయం సాధించింది ఈ సినిమా.

Also Read : Sankranti 2025 : వచ్చే సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ.. మళ్ళీ చిరు వర్సెస్ బాలయ్య?.. ఆ ముగ్గురు కూడా?

సంక్రాంతి పండక్కి లవ్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్ని కలగలిపిన పండగ లాంటి సినిమా నా సామిరంగతో కింగ్ నాగ్ వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. నా సామిరంగ సినిమా మొదటి రోజు 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా 24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది నా సామిరంగ. ఈ కలెక్షన్స్ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకో రెండు రోజులు హాలీడేస్ ఉండటం, 25 వరకు వేరే సినిమాలు లేకపోవడంతో నా సామిరంగ 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు.