Nagarjuna : ఓ పెద్దాయనను తోసేసిన నాగార్జున బాడీగార్డ్.. ట్విట్టర్లో క్షమాపణలు చెప్పిన నాగ్..

ఒక్కోసారి సెలబ్రెటీల మీదకు వచ్చే జనాలు, అభిమానులను తోసేసే సంఘటనలు కూడా జరుగుతాయి.

Nagarjuna : సెలబ్రెటీలు వెళ్తున్నప్పుడు జనాలు ఫోటోల కోసం, వాళ్ళని కలవడం కోసం ఎగబడతారు. ఇలాంటి సమయంలో సెలబ్రెటీల చుట్టూ ఉండే బాడీ గార్డ్ లు వాళ్ళని పక్కకి తప్పిస్తారు. ఒక్కోసారి సెలబ్రెటీల మీదకు వచ్చే జనాలు, అభిమానులను తోసేసే సంఘటనలు కూడా జరుగుతాయి.

తాజాగా నాగార్జున ఎయిర్ పోర్ట్ లో వెళ్తుండగా అక్కడ పనిచేసే ఓ పెద్దాయన నాగార్జునతో మాట్లాడటానికి వచ్చాడు. దీంతో నాగార్జున పక్కనున్న బాడీగార్డ్ అతన్ని పక్కకు తోసేసాడు. ఆ పెద్దాయన పడిపోవడంతో అక్కడే పనిచేస్తున్న వేరే వ్యక్తులు పట్టుకున్నారు. అయితే ఈ సంఘటనను నాగార్జున గమనించలేదు. ఈ ఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జున దీనిపై స్పందించాడు.

Also Read : అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశాను: బండి సంజయ్

నాగార్జున పెద్దాయనను తోసేసిన ఘటనపై స్పందిస్తూ.. ఇది నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్తున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నాగ్ ట్వీట్ వైరల్ అవ్వగా పలువురు బాడీగార్డ్ చేసిన తప్పుకు నాగార్జున ఏం చేస్తాడు, నాగార్జున చూస్తే అలా చేయనిచ్చేవారు కాదు, అయినా నాగార్జున క్షమాపణలు చెప్పాడు అని సపోర్ట్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కింగ్ నాగార్జున ప్రస్తుతం సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ వస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టారు. త్వరలోనే నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు