అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశాను: బండి సంజయ్

Bandi Sanjay: బండి సంజయ్ ఎంతో కష్టపడ్డారని, ఆయనకు తగిన పదవి లభించిందని..

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశాను: బండి సంజయ్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ సినీనటుడు చిరంజీవిని కలిశారు. బండి సంజయ్‌ను హైదరాబాదులోని తన నివాసంలోకి చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించారు.

బండి సంజయ్ ఎంతో కష్టపడ్డారని, ఆయనకు తగిన పదవి లభించిందని చిరంజీవి కొనియాడారు. విద్యార్థి దశలో చిరంజీవికి తాను వీరాభిమానినని బండి సంజయ్ చెప్పారు. ఇరువురి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై అరగంటకుపైగా చర్చ జరిగింది.

చిరుని కలవడం చాలా ఆనందంగా ఉందని బండి సంజయ్ చెప్పారు. మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు. ‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కలిశాను’ అంటూ బండి సంజయ్ ఎక్స్ లోనూ ఫొటోలు పోస్ట్ చేశారు.

కాగా, లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపుకోసం బండి సంజయ్ బాగా కష్టపడ్డారు. ఆయా గ్రామాల్లోని సమస్యలను నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియెజకవర్గాల్లోని మండలాల్లో యాత్ర కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్ధికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యాత్ర ద్వారా వివరించారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు