Nagarjuna Remuneration in Rajinikanth Coolie Movie and Telugu Rights gets Shocking Price
Nagarjuna : నాగార్జున రజినీకాంత్ కూలీ సినిమాలో సైమన్ అనే డాన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడం, ఇటీవల రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్ లో నాగ్ ఫేస్ కనపడకపోయినా హెయిర్ స్టైల్, లీక్ అయిన నాగార్జున లుక్స్ తో సినిమాపై, నాగ్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ ని చాలా రోజుల తర్వాత ఓ మాస్ పాత్రలో చూడబోతున్నామని ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కూలీ సినిమా ఆగస్టు 14 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. అయితే తాజాగా కూలీ తెలుగు రైట్స్, నాగార్జున రెమ్యునరేషన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకు తమిళ్ సినిమాలకు తెలుగులో అత్యధికంగా కంగువ సినిమాకు 25 కోట్లకు బిజినెస్ జరిగింది. ఇప్పుడు కూలీ సినిమా తెలుగు రైట్స్ ని అంతకు మించి నాగార్జున ఏకంగా 60 కోట్లకు కొనుక్కున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ తరపున నాగార్జున కూలీ తెలుగు రైట్స్ ఇంత భారీ ధరకు కొనుక్కున్నాడట. ఈ లెక్కన కూలీ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మరి అదే సమయానికి ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 సినిమా కూడా ఉంది.
ఇక ఈ సినిమాకు నాగార్జున ఏకంగా 24 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఆ 24 కోట్లు డబ్బులు తీసుకోకుండా తెలుగు రైట్స్ తీసుకొని మిగిలిన అమౌంట్ 36 కోట్లు చెల్లించేలా బిజినెస్ ప్లాన్ చేసుకున్నాడు నాగ్ అని తెలుస్తుంది. మొత్తానికి నాగార్జున మంచి హైప్ ఉన్న సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసాడు. లోకేష్ – రజిని సినిమా కావడంతో సినిమా ఎలాగో హిట్ అని ముందే అంతా ఫిక్స్ అయిపోతున్నారు. ఇందులో నాగ్ పాత్ర ఎలా ఉంటుంది, ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి.
Also Read : Tuk Tuk : ఓటీటీలో దూసుకుపోతున్న చిన్న సినిమా.. స్కూటర్ లో ఉండే ఆత్మ ఎవరిది?