Nagarjuna Shows Lady Comedian Bigg Boss Contestant Childhood Photo it goes Viral
Lady Comedian : తాజాగా నాగార్జున పలువురు కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలను బిగ్ బాస్ షోలో చూపించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో ఉన్న పాప ఇప్పుడు లేడీ కమెడియన్ గా సీరియల్స్, సినిమాల్లో దూసుకుపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో సందడి చేస్తుంది.
Also Read : Serial Actor : ఈ క్యూట్ పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు బిగ్ బాస్ లో దూసుకెళ్తున్న సీరియల్ స్టార్..
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరంటే నటి రోహిణి. సీరియల్స్ తో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్ గా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత రోహిణి పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా, టీవీ షోలలో అలరిస్తూ ఉంది. గతంలో ఓ సారి బిగ్ బాస్ కు వెళ్లిన రోహిణి ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల ఫ్యామిలీ ఎపిసోడ్ లో నాగార్జున పలువురి కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలు చూపించారు. ఈ క్రమంలో రోహిణి చిన్నప్పటి ఫొటో కూడా చూపించగా అది వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసి అప్పటికి, ఇప్పటికి రోహిణి చాలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.