‘కింగ్’ నాగ్ మనాలిలో మొదలుపెట్టాడు..

Wild Dog-Nagarjuna: ‘కింగ్’ నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మనాలీలోని సుందర ప్రదేశాల్లో మొదలైంది. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్షణ్యంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు.
నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.