Nagavamsi – Boney Kapoor : బోనీకపూర్ వర్సెస్ నాగవంశీ.. బాలీవుడ్ సినిమా ఇంకా అక్కడే ఉంది.. ఫుల్ కౌంటర్లు వేసిన నిర్మాత..

టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ నాగవంశీని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Nagavamsi Counters to Bollywood and Producer Boney Kapoor

Nagavamsi – Boney Kapoor : తాజాగా ఇయర్ ఎండ్ సందర్భంగా ఓ తమిళ మీడియా అన్ని భాషల పరిశ్రమల నుంచి పలువురు నిర్మాతలతో సినిమాల గురించి గ్రూప్ డిస్కషన్ పెట్టింది. ఈ మీట్ లో తెలుగు నుంచి నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ నుంచి సీనియర్ నిర్మాత బోనీ కపూర్ పాల్గొన్నారు. అయితే ఈ మీట్ లో నాగవంశీ వర్సెస్ బోనీ కపూర్ అన్నట్టు సాగింది.

నాగవంశీ తెలుగు సినిమాలను పొగుడుతూ బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య అంతగా వర్కౌట్ అవ్వట్లేదంటూ సౌత్ సినిమాలే బాలీవుడ్ లో ఆడుతున్నాయంటూ చెప్పడం కొన్నిటికి బోనీ కపూర్ ఒప్పుకోకపోవడం చిన్న వాగ్వాదంలా సాగింది. దీంతో వీరి చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ నాగవంశీని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Dil Raju : సీఎంతో మీటింగ్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. FDC చైర్మన్ హోదాలో దిల్ రాజు ట్వీట్ వైరల్..

బోనీకపూర్ మాట్లాడుతూ.. సౌత్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు సినిమాలకు అమెరికాలో, తమిళ్ సినిమాలకు సింగపూర్, మలేషియాలో, గల్ఫ్ కాస్మోపాలిటన్ ఏరియా అని అనడంతో నాగవంశీ మధ్యలో మాట్లాడుతూ.. గల్ఫ్ లో మలయాళం సినిమాలకు మార్కెట్ ఉంది. ఇలా అంటున్నాను అని ఏమనుకోండి. మా సౌత్ సినిమాలు మీరు సినిమాలను చూసే విధానం మార్చేశాయి. మీరు ఇంకా ఆ బాంద్రా, జుహుల కోసం సినిమాల దగ్గరే ఆగిపోయారు. మేము మాత్రం బాహుబలి, RRR , పుష్ప 2, KGF సినిమాలతో వచ్చాము. యానిమల్ కూడా తెలుగు డైరెక్టర్ తీసాడు అని అన్నారు.

అయితే దానికి బోనీకపూర్ మాట్లాడుతూ నేను ఒప్పుకోను అన్నారు. నాగవంశీ.. మీరు మొఘల్ ఏ ఆజం సినిమా తర్వాత ఏ బాలీవుడ్ సినిమా గురించి చెప్పలేదు అని అన్నారు. దానికి బోనికపూర్ మాట్లాడుతూ.. మా హిందీలో అలాంటివి ఎప్పుడో చేసేసాం. కొత్తదనం ఎప్పట్నుంచో ఉంది. గదర్, పఠాన్, జవాన్ సినిమాల గురించి బోనీ కపూర్ ప్రస్తావించగా అందులో జవాన్ అట్లీ సౌత్ డైరెక్టర్ తీసిందే అన్నాడు నాగవంశీ.

దానికి బోనికపూర్ మళ్ళీ పుష్ప 2 హీరో అమితాబ్ బచ్చన్ కి ఫ్యాన్ అని చెప్పాడు కానీ ఎన్టీఆర్ కి ఫ్యాన్ అని చెప్పలేదు అంటూ కౌంటర్లు వేయడంతో నాగవంశీ.. నేను కూడా షారుఖ్ ఫ్యాన్ ని, అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యాన్ కూడా. దానికి సినిమాలకు సంబంధం లేదు అని అన్నారు. దీంతో బోనికపూర్ ఏ భాషలో సినిమా వచ్చినా అది ప్రేక్షకులకు నచ్చితేనే హిట్ అవుతుంది. మరాఠీ సినిమా కూడా ఇటీవల 100 కోట్లు వసూలు చేసింది అని అన్నారు.

Also Read : Rashmika Marriage : తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుంది.. రష్మిక పెళ్లిపై నిర్మాత కామెంట్స్..

ఇక నాగవంశీ అయితే ఈ మీట్ లో బాలీవుడ్ పై గట్టిగానే కౌంటర్లు వేసాడు. పుష్ప 2 సినిమా హిందీలో మొదటిరోజే 84 కోట్లు కలెక్ట్ చేసేసరికి బాలీవుడ్ ఆ రాత్రి నిద్రపోలేదేమో అని కౌంటర్ వేసాడు. ఇలా బోనికపూర్ వర్సెస్ నాగవంశీ అన్నట్టు ఈ చర్చ కాసేపు సాగింది. ఈ చర్చల్లో నాగవంశీ కురినప్పుడల్లా బాలీవుడ్ మీద కౌంటర్లు వేయడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నాగవంశీని పొగుడుతుంటే బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం విమర్శలు చేస్తున్నారు.