Namrata Shirodkars birthday wish for sister Shilpa Shirodkar
నటి శిల్పా శిరోద్కర్ పుట్టిన రోజు నేడు (నవంబర్ 20). ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె సోదరి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా బర్త్ డే విషెస్ తెలియజేసింది. శిల్పాతో ఉన్న ఫోటోలను ఓ వీడియో రూపంలో షేర్ చేసింది. ప్రపంచంలోనే ఉత్తమ సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ నమ్రతా రాసుకొచ్చింది. బిగ్‌బాస్ 18లో ప్రతి రోజు తనను చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. విజేతగా రావాలని ఆకాంక్షించింది.
ప్రపంచంలోనే ఉత్తమ సోదరి అయిన శిల్పాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేను నిన్ను ప్రతి రోజు బిగ్‌బాస్ 18లో చూస్తున్నాను. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నువ్వు ఖచ్చితంగా బిగ్‌బాస్ టైటిల్‌తోనే తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అని నమత్రా రాసుకొచ్చింది.
మహేష్, నమత్రల గారాల పట్టి సితార సైతం శిల్పాకు బర్త్ డే విషెస్ తెలియజేసింది. సూపర్ ఉమెన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని బిగ్‌బాస్ 18లో చూడడం ఎంతో సరదాగా ఉంది. మీరు చాలా బాగా ఆడుతున్నారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండడండి అని సితార రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శిల్పా హిందీ బిగ్‌బాస్ సీజన్ 18లో పాల్గొంది.
Allu Arjun : డాడీ ప్రిన్సెస్.. అర్హతో క్యూట్ ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్..