Rapo 22 : సినిమా ఫ్లాపైనా వ‌రుస ఛాన్స్‌లు కొట్టేస్తున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ భామ‌.. ఎన‌ర్జిటిక్ స్టార్ సినిమాలో..

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది భాగ్య‌శ్రీ బోర్సే.

Rapo 22 : సినిమా ఫ్లాపైనా వ‌రుస ఛాన్స్‌లు కొట్టేస్తున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ భామ‌.. ఎన‌ర్జిటిక్ స్టార్ సినిమాలో..

Bhagyashree borse romance With Ram Pothineni in Rapo 22 movie

Updated On : November 20, 2024 / 11:59 AM IST

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ చిత్రం ఆశించిన మేర అంచ‌నాల‌ను అందుకోన‌ప్ప‌టికి భాగ్య‌శ్రీ మాత్రం మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. త‌న గ్లామ‌ర్‌, యాక్టింగ్‌తో యూత్ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. తెలుగులో ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. అయితే.. అమ్మడు ఆచితూచి చిత్రాల‌ను ఎంపిక చేసుకుంటోంది. రానా, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ కాంత‌లో న‌టిస్తోంది.

ఇక తాజాగా ఉస్తాద్ రామ్ పోతినేని స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. మ‌హేబ్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఓ చిత్రంలో న‌టించ‌నున్నారు. #RAPO22 అనే వ‌ర్కింగ్ టైటిట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ పై న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Allu Arjun : డాడీ ప్రిన్సెస్.. అర్హతో క్యూట్ ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్..

గురువారం ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ చిత్రంలో న‌టించే క‌థానాయిక పేరు వెల్ల‌డించారు.

భాగ్య‌శ్రీ బోర్సెను ఎంపిక చేసిన‌ట్లుగా తెలిపింది. ఇక రామ్‌, భాగ‌శ్రీ పెయిర్‌, సీన్స్ సినిమాలో హైలెట్స్‌లో ఒక‌టి అవుతాయ‌ని చిత్ర బృందం చెబుతోంది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Game Changer : గేమ్ ఛేంజర్ మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్.. ఈసారి మెలోడీ..