Game Changer : గేమ్ ఛేంజర్ మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్.. ఈసారి మెలోడీ..
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా మూడో పాట అప్డేట్ ఇచ్చాడు తమన్.

Ram Charan Game Changer Third Song Update by Music Director Thaman
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా జంటగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అంజలి, సునీల్, సముద్రఖని, SJ సూర్య.. పలువురు స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
Also Read : Rocking Rakesh : పాపం తన సినిమా పోస్టర్స్ తానే గోడ మీద అతికించుకుంటున్న జబర్దస్త్ రాకేష్..
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా మూడో పాట అప్డేట్ ఇచ్చాడు తమన్. గేమ్ ఛేంజర్ మూడో సాంగ్ ఈసారి మెలోడీ పాట రాబోతుంది. రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. టీజర్ లో ఓ మెలోడీ సాంగ్ కి సంబంధించిన రెండు షాట్స్ చూపించారు. ఆ పాట స్విట్జర్లాండ్ లో చిత్రీకరించినట్టు సమాచారం. దీంతో ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
It’s tat Melody Gonna Make Some Lovely Memories #GameChangerThirdSingle 🩷 🎈
Ready Guys 📢. 🎵
— thaman S (@MusicThaman) November 20, 2024
ఇప్పటికే రెండు మాస్ బీట్ సాంగ్స్ వచ్చి వైరల్ అవ్వగా ఈసారి మెలోడీ సాంగ్ ఎలా మెప్పిస్తుందో చూడాలి. అలాగే శంకర్ లవ్ సాంగ్స్ లో ఉండే భారీతనం కూడా ఈ పాటలో ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నవంబర్ లాస్ట్ వీక్ లో ఈ పాట రానున్నట్టు సమాచారం.