Rocking Rakesh : పాపం తన సినిమా పోస్టర్స్ తానే గోడ మీద అతికించుకుంటున్న జబర్దస్త్ రాకేష్..
తాజాగా రాకేష్ అర్ధరాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ తన సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది.

Jabardasth Rocking Rakesh Hard Work for his KCR Movie Promotions
Rocking Rakesh : మిమిక్రీతో కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి పిల్లల స్కిట్స్ తో బాగా పాపులర్ అయ్యాడు రాకేష్. జబర్దస్త్ తో రాకింగ్ రాకేష్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. మరో నటి సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాకేష్. అయితే రాకేష్ తనే హీరోగా, నిర్మాతగా KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాని తెరకెక్కించాడు.
ఈ సినిమా కోసం తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చానని, తాను సంపాదించింది అంతా సినిమాలో పెట్టానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు రాకేష్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన KCR సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రాకేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు రాకేష్.
తాజాగా రాకేష్ అర్ధరాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ తన సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా వాల్ పోస్టర్స్ కి డబ్బులిస్తే ప్రింట్ చేసి అతికిస్తారు. కానీ రాకేష్ ఇలా స్వయంగా తనే రోడ్ల మీదకొచ్చి గోడలకు తన సినిమా పోస్టర్స్ అతికించుకోవడం చర్చగా మారింది. ఇప్పటికే సినిమాకు చాలా పెట్టేసాడని , ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అయినా సేవ్ చేద్దామని రాకేష్ ఇలా కష్టపడుతున్నాడు అంటూ పలువురు సపోర్ట్ చేస్తున్నారు. అయితే పలువురు మాత్రం ఇది కూడా కొత్తరకం ప్రమోషన్స్ అని అంటున్నారు. మరి రాకింగ్ రాకేష్ KCR సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.