ధైర్యానికే ధైర్యం బాలయ్య..

  • Publish Date - October 20, 2020 / 08:57 PM IST

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకష్ణ కల్మషం లేని వ్యక్తి అని ఆయణ్ణి దగ్గరినుండి చూసినవారు చెప్తుంటారు. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్‌గా బిజీగా ఉండే బాలయ్య తరచూ ఆసుపత్రిని సందర్శించి క్యాన్సర్ బాధితులకు ధైర్యం చెబుతుంటారు.

మంగళవారం తమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధితురాలు చైతన్య అనే యువతిని పరామర్శించారు బాలయ్య. ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా వైద్యుల సాయంతో త్వరగా కోలుకుంది.

ఈ నేపథ్యంలో చైతన్యకు ట్రీట్‌మెంట్ చేస్తున్న బసవతారకం ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య చైతన్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చైతన్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు బాలయ్య. చైతన్య కూడా బాలయ్యకు వైద్యులకు కృతజ్ఙతలు తెలిపింది. ఈ విషయం తెలిసి మా బాలయ్య ధైర్యానికే ధైర్యం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.